మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ళ పింఛన్ల పంపిణీ

మండపేట పట్టణంలోని 2, 3, 4 వార్డుల్లో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొని, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పింఛన్ల పెంపుపై సంతకం చేసి పేదల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని ఆయన కొనియాడారు. ఎన్నికల హామీ మేరకు పెంచిన పింఛన్‌ను ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించడం ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్