ద్వారపూడిలో ఘోరం: భార్య కళ్లెదుటే నవ వరుడి దారుణ హత్య

అన్నవరంలో వివాహం ముగించుకుని భార్యతో బైక్‌పై ఇంటికి వస్తున్న నవవరుడు సూర్య ప్రకాశరావును ద్వారపూడి వద్ద దుండగులు అడ్డుకున్నారు. విచక్షణారహితంగా దాడి చేసి, ముఖంపై బండరాయితో కొట్టి హత్య చేశారు. భార్య సంధ్య ఎంత వేడుకున్నా కనికరించని నిందితులు పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్