మండపేటలో డీజిల్ సరఫరాపై కీలక నిర్ణయాలు

మండపేట తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం రెవెన్యూ, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖల అధికారులు బంక్ యజమానులతో సమీక్ష నిర్వహించారు. డీజిల్ కొరత దృష్ట్యా అంబులెన్స్‌లు, కోత మిషన్లు, ట్రాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రైతులు డీజిల్ పొందాలంటే విఆర్ఓ, వ్యవసాయ సహాయకులు జారీ చేసే కూపన్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు. పర్యవేక్షణ కోసం ప్రతి బంకుకు ఒక విఆర్ఓను నియమించారు. నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు నివేదించాలని, అవసరమైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్ మెహర్ బాబా, ప్రసన్న జ్యోతి, ఏవో ప్రభాకర్ మరియు బంక్ యజమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్