రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విలీనం ఒక అపోహ అన్న మాటలపై తీవ్రంగా స్పందించారు. మండపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ, తోట త్రిమూర్తులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, మండపేట నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మార్పులు జరిగినా, మండపేటలో మాత్రం తోట మార్పులు చేయలేదని, పార్లమెంట్ కు, జిల్లా కేంద్రానికి తేడా తెలియని అమాయకులా తోట అని ఆయన ప్రశ్నించారు.