మొంథా తుఫాను కారణంగా కోతకు వచ్చిన పంటలు నేలపాలయ్యాయని, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. గురువారం మండపేట మండలం మారేడుబాక గ్రామంలో వ్యవసాయ అధికారులతో కలిసి ఆయన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, ప్రతీ రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే వేగుళ్ళ భరోసా ఇచ్చారు.