మండపేట: 'ఉమీద్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి'

రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయం, సహ ఉమ్మడి తూ. గో. జిల్లాల ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ లు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ మంగళవారం మండపేటలో తెలిపారు. ఉమీద్ పోర్టల్ గడువు ఈ నెల 5వ తేదీతో ముగియనున్నందున, మస్జిద్‌లు, దర్గాలు, అశూర్‌ఖానాలు, కబర్‌స్తాన్లు సహా అన్ని వక్ఫ్ సంస్థల నిర్వాహకులు ఆలస్యం చేయకుండా వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర చర్యలు తక్షణమే చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్