మండపేట: శుక్రవారం ఈ ప్రాంతాల్లో పవర్ కట్

మండపేట పట్టణంలో పలు ప్రాంతాలకు శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ రత్నాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడిద రోడ్డులోని వివిధ సబ్ స్టేషన్ లలో మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 8 గంటల నుంచి 1 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. రాజీవ్ గృహకల్ప, సంఘం కాలనీ, ఆర్టీవో ఆఫీస్ రోడ్డు, విజయలక్ష్మి నగర్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్