మండపేట 30వ వార్డు కౌన్సిలర్ మారిశెట్టి సత్యనారాయణ వైసీపీ మునిసిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి నుండి వైసీపీలో విశేష సేవలు అందించిన సత్యనారాయణకు పార్టీ జిల్లా స్తాయి పదవి లభించడం పట్ల వైసీపీ టౌన్ మాజీ అధ్యక్షులు ముమ్మిడివరపు బాపిరాజు, వైసీపీ నాయకులు మొండి మురళీలు గురువారం హర్షం వ్యక్తం చేశారు.