మండపేట: ప్రభుత్వ బడిలో మెరిసిన మట్టిలో మాణిక్యాలు

మండపేటలోని పాలడుగు సత్యవతి చంద్రమౌళి బాలికోన్నత పాఠశాలకు చెందిన భావిక (నూజివీడు), ప్రియాంక (ఒంగోలు) 2026 విద్యా సంవత్సరానికి గాను ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించి ప్రతిభ కనబరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ, కష్టతరమైన పరిస్థితులను అధిగమించి ఈ ఘనత సాధించిన విద్యార్థినులను శనివారం ఎంఈఓలు రామచంద్రరావు, సోమిరెడ్డి, హెచ్ఎం ముంగర వెంకటరాజు, విద్యా కమిటీ చైర్మన్ సత్యప్రియ, ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. ఈ విజయం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్