మండపేట: 'గోమాతకు జాతీయ జంతువు హోదా ఇవ్వాలి'

టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్, సామాజిక సామరస్యం, హిందూ సోదరుల మనోభావాల గౌరవార్థం గోమాతకు జాతీయ జంతువు హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మండపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఏపీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 12 ఏళ్లుగా ముస్లింలు ఈ డిమాండ్‌పై ఏకాభిప్రాయంతో ఉన్నారని గుర్తుచేశారు. మతాలు వేరైనా పరస్పర గౌరవం అందరి బాధ్యతని, దేశంలో గోసంరక్షణ, సామాజిక ఐక్యత కోసం ముస్లిం పెద్దలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్