మండపేటలో మే డే వేడుకలు - ప్రజలకు మజ్జిగ పంపిణీ

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, శుక్రవారం మండపేటలోని కరాచీ సెంటర్ వద్ద ఏపీఎస్‌ఈఈ యూనియన్ (నంబర్ 327) ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమం జరిగింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు విద్యుత్ శాఖాధికారులు, యూనియన్ సభ్యులు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఎం. మూని, జేఈ పి. వి. వి. సత్యనారాయణ, యూనియన్ నేతలు పి. ఎస్. ఎస్. వెంకటేశ్వరరావు, కుమార్ బాబు తదితరులు పాల్గొని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. మే డే నాడు చేపట్టిన ఈ సామాజిక కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్