మండపేటలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గురువారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రుల ఆత్మగౌరవం అంటేనే నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మండపేట టీడీపీ కార్యాలయం నుంచి కరాచీ సెంటర్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించేలా చేసిన ధ్రువతార ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్