పసలపూడి విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతులు చేపట్టనున్నట్లు రామచంద్రపురం డీఈఈ రత్నాలరావు గురువారం తెలియజేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పసలపూడి, చెల్లూరు, మాచవరం గ్రామాల్లోని వ్యవసాయ, వాణిజ్య, గృహ విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.