రాయవరం: 'వెంటనే పీఆర్సీ నియమించి, ఐఆర్ ప్రకటించాలి'

పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపి మూర్తి మంగళవారం రాయవరం మండలంలోని పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం పెరగడం వల్ల తరగతి గదుల్లో నేరుగా పాఠాలు చెప్పలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. బోధనేతర పనుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే పీఆర్సీ నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, ఉపాధ్యాయులపై అదనపు భారం మోపడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్