మండపేటలో వైభవంగా బసవేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవం

మండపేటలోని సూర్యారావుపేటలో శ్రీ బసవేశ్వర స్వామి వారి నూతన దేవాలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం జరిగిన ప్రధాన ఘట్టంలో భాగంగా హస్త నక్షత్రయుక్త మిథున లగ్నంలో బసవేశ్వర స్వామితో పాటు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి వార్ల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బిక్కిన గోపాలకృష్ణ, పద్మ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. దొంతంశెట్టి వీరబాబు సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రతువులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్