మండపేట పట్టణం రథం సెంటర్ వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధనస్వామి వారి నూతన ధ్వజస్తంభ మరియు పున: ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన కుమార్తె మణిమంజరి, అల్లుడు సురేష్ కుమార్‌తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు శాస్త్రోక్తంగా విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠాపన వంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పిల్లి గంగరాజు, చుండ్రు అగస్తిరాజు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.