కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలోని గోదావరి తీరాన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం సోమవారం కనులపండువగా జరిగింది. వేద పండితులు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రతువులో మాజీ సర్పంచ్ సలాది వీరబాబు-చంద్ర జానకి దంపతులు పాల్గొని కళ్యాణాన్ని జరిపించారు. విఘ్నేశ్వర పూజ, హోమం, పూర్ణాహుతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోగా, అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది.