సత్యనారాయణపురంలో వైభవంగా వరసిద్ధి వినాయక విగ్రహ ప్రతిష్ఠ

కపిలేశ్వరపురం మండల కేంద్రం శివారు సత్యనారాయణపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం మరియు శిఖర ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా గురువారం జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్