రాయవరం మండలం వెదురుపాకలో జరుగుతున్న పోలేరమ్మ జాతరలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగళవారం తన స్వగృహానికి విచ్చేసిన ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గరగ నృత్య కళాకారుల డప్పు దరువులకు అనుగుణంగా దేవిశ్రీ ఉత్సాహంగా స్టెప్పులు వేసి స్థానికులను అలరించారు. జాతరలో సామాన్యుడిలా అందరితో కలిసిపోయి సందడి చేసిన ఆయనను చూసి గ్రామస్తులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.