పెట్టా వారిపేటలో ఘనంగా 'బడి బాట' ర్యాలీ

ముమ్మిడివరం మండలం పెట్టా వారిపేట ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బుధవారం 'బడి బాట' కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో భారీ ర్యాలీ తీసి, 'ప్రభుత్వ బడులే ముద్దు-ఒత్తిడి లేని విద్యే మన హక్కు', 'మన ఊరి బడిని మనం కాపాడుకుందాం' వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించి, ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఉచిత, నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్