కాట్రేనికోన హైస్కూల్ మైదానంలో బుధవారం జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌లో ఎస్ఐ అవినాశ్ పాల్గొని యువత క్రీడల ప్రాధాన్యతను వివరించారు. సెల్ ఫోన్ గేమ్‌లకు పరిమితమవుతున్న నేటి యువతకు ఫిజికల్ గేమ్స్ తప్పనిసరి అని, ఇవి మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, మెరుగైన ఆరోగ్యానికి దోహదపడతాయని ఆయన అన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు.