కోనసీమలో ఒక్కసారిగా పడిపోయిన కొబ్బరి ధరలు

కోనసీమలో కొత్త కొబ్బరి, కురిడి, పచ్చి కాయల ధరలు గణనీయంగా తగ్గాయి. శుభకార్యాలు లేకపోవడం, తమిళనాడు, కేరళల్లో ఉత్పత్తి పెరగడంతో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని వ్యాపారస్తులు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం వెయ్యి కొత్త పచ్చి కాయల ధర రూ. 13,000 నుండి రూ. 14,000 వరకు పలుకుతోంది. ఈ డిమాండ్ లేమి ధరల పతనానికి కారణమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్