కాట్రేనికోన మండలంలో డీజిల్ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి బంకులకు స్టాక్ రావడంతో సాగుదారులు డబ్బాలతో భారీగా క్యూ కట్టారు. జిల్లాలో ఇంధన కొరత లేదని కలెక్టర్ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక్కొక్కరికి కేవలం 10 లీటర్లే సరఫరా చేస్తుండటంపై రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సాగు పనుల సీజన్‌లో ఇంత తక్కువ ఇంధనం దేనికీ సరిపోదని, దీనివల్ల పనులు నిలిచిపోతున్నాయని వారు వాపోతున్నారు. ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని, తక్షణమే పూర్తిస్థాయిలో డీజిల్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.