కోవిడ్ పాజిటివ్ వచ్చిన 45 మందికి కిట్లు పంపిణీ

ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామంలో సోమవారం కోవిడ్ పాజిటివ్ వచ్చిన 45 మందికి గ్రామ సర్పంచ్ పుత్తూరు ఉమారాణి పిటీవీ వర్మ కిట్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 30 గుడ్లు, బాదంపప్పు, ఖర్జూరం, బ్రెడ్, బిస్కెట్లు ప్యాకెట్లు, కిట్లను వాలంటీర్స్ ద్వారా అందజేశారు. వాలంటీర్లు నిబంధనలు పాటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఇంటి నుండి బయటకు రాకుండా మీకు కావలసిన నిత్యావసర సరుకులు ఫోన్ చేస్తే నేరుగా మీ ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, టివిఎస్ వర్మ, వంశి తేజ విశ్వనాథరాజు, సంజీవ్ వర్మ, వీరబాబు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్