ఐ. పోలవరం: విద్యుత్ షాక్ తో ఒక యువకుడు మృతి

ఐ.పోలవరం మండలం ఐ.పోలవరంలో ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. ఐ.పోలవరానికి చెందిన కోడూరి వెంకటేష్(33) ప్రైవేటు ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. సోమవారం విద్యుత్తు పనులు చేస్తుండగా షాక్ కు గురికావడంతో స్థానికులు టి.కొత్తపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్