చెయ్యేరులో విద్యార్థులు అన్నం తినే ప్లేట్లలో తల్లులకు పాదపూజ

కాట్రేనికోన మండలం వ్యాప్తంగా మెగా పేరెంట్, టీచర్ సమావేశాలు గురువారం ఘనంగా జరిగాయి. అయితే చెయ్యేరులో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు తమ తల్లులకు అన్నం తినే ప్లేట్లలో పాదపూజ చేయడం విమర్శలకు దారితీసింది. పాదపూజకు ఇళ్లనుంచి పళ్లాలను ఎవరూ తెచ్చుకోకపోవడంతో దాతలు అందించిన ప్లేట్లలో కొన్నింటిని తీసి పాదపూజ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్