కాట్రేనికోన: మత్స్యకారుల మధ్య వివాదం పరిష్కారం

కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో నిబంధనలకు విరుద్ధంగా రంగుల వలలతో చేపల వేట సాగించడంపై తలెత్తిన వివాదం సోమవారం పోలీసుల సమక్షంలో పరిష్కారమైంది. ఎక్కువ పొరలున్న వలలతో వేటాడటం వల్ల మత్స్య సంపద తగ్గి, ఇతరుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆరోపిస్తూ సుమారు 300 మంది మత్స్యకారులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎస్సై అవినాష్, టీడీపీ నేత నాగిడి నాగేశ్వరరావు, జనసేన నేత గుద్దటి జమ్మి సమక్షంలో జరిగిన శాంతి సమావేశంలో, ఇకపై అటువంటి వలలతో వేట సాగించబోమని సంబంధిత వ్యక్తులు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్