కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో దిత్వా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి రైతు నంద్యాల ముసలయ్యకు చెందిన సుమారు 12 ఎకరాల వరి పంట నీటిపాలైంది. కోత కోసి పన మీద ఉన్న పంట కూడా వర్షానికి తడిచిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ముసలయ్య సోమవారం కోరారు.