నంబరు బోర్డులు లేకుండా, అతివేగంగా ద్విచక్ర వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ముమ్మిడివరం సీఐ ఎం. మోహనకుమార్ హెచ్చరించారు. మంగళవారం ముమ్మిడివరంలో నంబరు బోర్డులు లేని, అతివేగంగా నడుస్తున్న పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సెలింగ్ ఇచ్చి, జరిమానా విధించారు. అక్కడికక్కడే నంబరు బోర్డులు రాయించిన తర్వాతే వాహనాలను వదిలిపెట్టారు. ఈ తనిఖీల్లో ఎస్సై డి. జ్వాలాసాగర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.