ముమ్మిడివరంలో జాతీయ రహదారిపై కొచ్చి నుంచి కలకత్తా వెళ్తున్న ఓఎన్జీసీకి చెందిన వాహనంలో మండే స్వభావం ఉన్న రసాయనాలు ఉన్న ట్యాంకర్ గురువారం అర్ధరాత్రి బోల్తాపడింది. ప్రమాదం విషయాన్ని ఆ సంస్థ అధికారులకు తెలియజేయడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. వాహనానికి వంద మీటర్ల దూరంలో ఎవరినీ అనుమతించవద్దని సూచించారు. పోలీసులు, ఓఎన్జీసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు.