ఐ. పోలవరం మండలం మురమళ్ల పరిధిలోని పితానివారిపాలెంలో నివాసముంటున్న దండుప్రోలు మారాజు (33) శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బలుసుతిప్పకు చెందిన మారాజుకు, అతని భార్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మనస్పర్థల కారణంగా భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని కాకినాడలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన మారాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.