ముమ్మిడివరంలో వైభవంగా శ్రీలంకతల్లమ్మ అమ్మవారి తీర్థం!

ముమ్మివరంలో గ్రామదేవత శ్రీలంకతల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయాన్ని అందంగా అలంకరించగా, భక్తులు వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు పొలమూరి సత్యనారాయణ, రాజు, దుర్గారావుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు మేళతాళాలతో పసుపు, కుంకుమలను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్