ముమ్మిడివరంలో వైభవంగా శ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్ఠ

ముమ్మిడివరం మండలంలోని ఠాణేల్లంక శివారు గురుకుల పాఠశాల సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో, హిందూ ధర్మ పరిరక్షణ సమితి సహకారంతో జరిగిన ఈ వేడుకకు బ్రహ్మశ్రీ కాల్దారి వరప్రసాద్ బ్రహ్మత్వం వహించారు. గణపతి పూజ, కలశ స్థాపన, శాంతి హోమం అనంతరం దంపతుల సమేతంగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, గొలకోటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్