ముమ్మిడివరంలో సోమవారం ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యంతో చేపట్టిన ‘పి-4’ (P4) మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తొలగించి, ప్రతి కుటుంబాన్ని సంపన్నంగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. విజన్ 2047 ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అభివృద్ధి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.