తాళ్లరేవు: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

తాళ్లరేవు మండలం ఇంజరం సబ్ స్టేషన్ పరిధిలో కొన్ని ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని సంబంధిత అధికారులు బుధవారం తెలియజేశారు. సుంకరపాలెం, ఉప్పంగల, లచ్చిపాలెం గ్రామాల్లో చెట్టు కొమ్మల తొలగింపులో భాగంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ ఎన్. ఉదయభాస్కర్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఒంటిగంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు సహకరించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్