కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో నిబంధనలకు విరుద్ధంగా రంగుల వలలతో వేట సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మత్స్యకారులు సోమవారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. సంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి సాగిస్తున్న ఈ వేట వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని బాధితులు ఆరోపించారు. నిందితులపై కేసులు నమోదు చేసి, మత్స్యకార నిబంధనలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు విన్నవించారు.