కోనసీమ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తాళ్ళరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ సమీపంలో 216 జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారు కాకినాడ నుండి ఐ. పోలవరం మండలం పెదమాడి గ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన మహిళ మందపాటి సుభద్రమ్మ వయస్సు (67)గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్