యానాం: రీజెన్సీ సిరామిక్ అధినేత జి. ఎన్. నాయుడు ఇకలేరు

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం టి. కమ్మపల్లికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు జి. ఎన్. నాయుడు బుధవారం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడైన ఆయన, యానాంలో 'రీజెన్సీ సిరామిక్' పరిశ్రమను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. గతంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణం కోనసీమ, రాయలసీమ ప్రాంతాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్