తాళ్ళరేవులో వైసీపీ ‘వెన్నుపోటు దినం’!

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు తాళ్ళరేవు మండలంలో "వెన్నుపోటు దినం" కార్యక్రమం గురువారం విజయవంతంగా జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పొన్నాడ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, ఎస్‌ఈసీ సభ్యురాలు కాశి బాలమునికుమారి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్