రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి

తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన అడపా సత్యనారాయణ (48) ఆదివారం ఉదయం ప. గో జిల్లాలో జాతీయ రహదారి 216ఏపై తణుకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన కుమార్తె ఆసుపత్రిలో ఉండటంతో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, షర్మిష్ట కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన తణుకులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో వాహనం నుజ్జుకాగా, కారు డివైడర్ ఎక్కింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్