ఆకివీడు పెదపేటలో వివాదాస్పద గొంతేనమ్మ గుడిని అర్ధరాత్రి నిరంకుశంగా కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిడదవోలులో నిరసన వ్యక్తం చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన డిప్యూటీ స్పీకర్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, సీఎం చంద్రబాబు స్పందించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.