నిడదవోలులో అల్లూరి వర్ధంతి కార్యక్రమం

మన్యం విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమం నిడదవోలులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు జువ్వల రాంబాబు, కార్యకర్తలు అల్లూరి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన వీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో యువత పయనించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్