కేరళ రాజధాని తిరువనంతపురంలో జరుగుతున్న 'గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026' సదస్సులో ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు. ఏపీ కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని, అది ఒక మరపురాని అనుభూతి అని, ప్రతి ప్రయాణమూ ఒక కథను చెబుతుందని, ప్రతి సందర్శకుడూ అందులో భాగమవుతారని ఆయన వ్యాఖ్యానించారు. దేశ పర్యాటక రంగంలో ఏపీ ఒక కీలక శక్తిగా ఎదుగుతోందని మంత్రి కొనియాడారు. ఈ సదస్సు బుధవారం సాయంత్రం ప్రారంభమైంది.