తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహాల గృహ ప్రవేశ కార్యక్రమాలను ఈ నెల 30వ తేదీన విస్తృతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. టిడ్కో, హౌసింగ్ పథకాల కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేసే ఈ కార్యక్రమాలకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అధికారులకు ఆమె సూచించారు.