అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంపై నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చింతూరు–మారేడుమిల్లి సమీపంలో లోయలో పడిన ట్రావెల్స్ బస్సు ఘటనలో 9 మంది మృతి చెందడం, 17 మంది యాత్రికులు గాయపడడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.