నిడదవోలులోని 10వ వార్డు రజకుల వీధిలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులైన వారందరికీ ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచి, వాటిని సకాలంలో అందిస్తోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.