వైసీపీ నేత భూదౌర్జన్యంపై మంత్రి దుర్గేష్ సీరియస్

సమాజంలో అండలేని మహిళలు, పేదలపై జరిగే అన్యాయాలను సహించబోమని, ప్రతి ఆడబిడ్డకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. గురువారం నిడదవోలులో మంత్రిని కలిసిన శీలావతి అనే మహిళ, తమ వారసత్వ స్థలాన్ని వైసీపీకి చెందిన ఊర్ల హరికృష్ణ ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి, స్థానిక అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్