నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఒక దివ్యాంగురాలికి రూ.15,000 పెన్షన్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ధవళేశ్వరం పెన్నేటి వారి వీధికి చెందిన 90 శాతం వికలాంగురాలు కోలాటి సత్యవేణి (46) తన వైద్య ఖర్చులు, కుటుంబ పోషణకు ప్రస్తుతం వస్తున్న రూ.6,000 పెన్షన్ సరిపోవడం లేదని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో రూ.15,000 పెన్షన్ మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మంత్రి వెంటనే స్పందించి, ఆమె వివరాలు సేకరించి, త్వరలోనే పెన్షన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.