మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా సీసీ రోడ్ల ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో పల్లెపండుగ 2.0 కింద రూ.24.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ శనివారం ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటికే రూ.6.60 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని పనులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్