నిడదవోలు పట్టణంలో ఆర్వోబీ పనులను వేగవంతం చేస్తున్నందుకు స్థానికులు మంత్రి దుర్గేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వంతెన పూర్తయితే దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం, జెడ్పీహెచ్ఎస్ శెట్టిపేటలో చదువుతున్న తాళ్ళపాలెంకు చెందిన భవన యమున అనే విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో 547 మార్కులు సాధించినందుకు మంత్రి దుర్గేష్ అభినందించారు. భవిష్యత్తులో ఐఐటీ చదువుతానని కోరిన బాలికకు ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.